జనసేన అధికార ప్రతినిధి కీర్తనతో జేఎస్పి గ్లోబల్ టీమ్ జూమ్ సమావేశం

జేఎస్పి గ్లోబల్ టీమ్, 2023 సంవత్సరంలో మొదటి జూమ్ సమావేశం ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మరియు వీరమహిళలకి శుభాకాంక్షలు తెలియచేస్తూ సాధారణ వీరమహిళగా జనసేనలో తన ప్రయాణం మొదలుపెట్టి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీగా పనిచేసి వివిధ డిబేట్లలో పాల్గొని ప్రత్యర్ధులకు తనదైన శైలిలో సమాధానం చెప్తూ జనసేన అధికార ప్రతినిధిగా ఎదిగిన పరింగిశెట్టి కీర్తనతో జూమ్ సమావేశాం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం జేఎస్పి గ్లోబల్ టీమ్ ఫౌండర్ సురేష్ వరికూటి అధ్వర్యంలో పద్మజ రామిశెట్టి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. గ్లోబల్ గా ఉన్న 25 దేశాల నుంచి జనసేన కార్యకర్తలు మరియు లీడర్స్ అయిన వీరమహిళలు, జనసైనికులు పాల్గొనడం జరిగింది. పరింగిశెట్టి కీర్తన ఈ సందర్భంగా వారు చేసే కృషిని గుర్తించి జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా నియమించినందుకు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియచేసారు. మనీ లేకుండా కస్టపడి వర్క్ చేసిన వారికీ రాజకీయ పదవులు ఇవ్వటం మన జనసేనలోనే సాధ్యం అని పవన్ కళ్యాణ్ ని అభినందించారు. మహిళలు రాజకీయాలలో ఎలా రాణించాలో ఇంకా కొత్తవారు చేరటానికి సూచనలు ఇచ్చారు. గ్లోబల్ గా ఉన్న జనసేన వీరహిళలు నుంచి సూచనలు తీసుకొంటూ ప్రజల్లో చైతన్యం తీసుకు రావటానికి కృషి చేస్తానని అన్నారు. ఆస్ట్రేలియా నుంచి వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొని గత కొద్దిరోజులుగా ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ సభలకు విచ్చేసినటువంటి నాగబాబు, జబర్దస్త్ అది, ఉదయ్ తంగెళ్ళ జనసైనికులలో ఉత్తేజాన్ని నింపుతూ ఓపిగ్గా అందరితో ఫొటోస్ తీసుకోటానికి సమయం ఇస్తు అన్ని ప్రాంతాలలో ఉన్న తెలుగు వారిని కలుస్తున్నారు అని తెలియచేసారు. మన తెలుగు రాష్ట్రాల మహిళలలో చైతన్యం తీసుకురావటానికి వారికి, ఎన్నారై జనసేన టీమ్స్ ద్వారా మహిళా సధికారత్ కొరకు మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచే సలహాలు సూచనలు పంచుకొన్నారు. జనసైనికులు మరియు వీర మహిళలు వారి సలహాలను పంచుకోవడం జరిగింది. ఈ సమావేశంలో జర్మనీ నుండి సురేష్ వరికూటి, రాజా సి.హెచ్, యూకే నుండి నాగరాజు వాడ్రాణం, పద్మజ రామిశెట్టి, అమల చలమలశెట్టి, హరి పటేళ్ల, హిమవల్లి చలికొండ, సేచెల్లీస్ నుండి రమేష్ సేపేన, ఆస్ట్రేలియా నుండి హేమ, సౌజన్య, మురహరి నాయుడు గాజుల, రామకృష్ణ, రాంతేజ్, అమెరికా నుండి సాయి కృష్ణ తేజ, న్యూజిలాండ్ నుండీ సత్య తట్టల, రఘు రాగి, డెన్మార్క్ నుండి చైతన్య సాయి తోట, వేణు వడ్లమూడి, కెనడా నుండి కళ్యాణ్, దుబాయ్ నుండి ఇంద్రనీల్ ముప్పడి మరియు ఇండియా నుండి ప్రభావతి వసంతాల పాల్గొన్నారు.