నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవితో జేఎస్పీ గ్లోబల్ టీం జూమ్ సమావేశం

జేఎస్పీ గ్లోబల్ టీం ఆధ్వర్యంలో మార్చి 8 శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జేఎస్పీ గ్లోబల్ టీమ్ వీర మహిళలు, జనసేన మొదటి మహిళా ఎమ్మెల్యే అయిన నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవితో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో యుకె, కెనడా, ఆస్ట్రేలియాల నుండి జేఎస్పీ గ్లోబల్ టీం వీరమహిళలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన ఎన్ఆర్‌ఐ వీర మహిళలు టీం సభ్యులు పాల్గొని, మొట్టమొదటి జనసేన మహిళా ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీమతి లోకం మాధవికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ ఆమె ఈ మీటింగ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా భావించారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మహిళలకు తన అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా సాధికారికతపై చర్చ జరిగింది. మహిళలు తమ కాళ్లపై నిలబడేలా గ్రామాల్లో మహిళలకు సహకారం అందించేందుకు పనిచేయాలని ఎన్ఆర్‌ఐ వీర మహిళలను లోకం మాధవి సూచించారు. ఈ అంశానికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి అందించేలా కృషి చేస్తామని, అలాగే, ఎన్ఆర్‌ఐలు జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలపరిచేందుకు తమ వంతు కృషి చేయాలని ఆమె పలు సూచనలు ఇవ్వగా ఎన్నారై వీరమహిళలు తప్పకుండా తమవంతు కృషి చేస్తామని తెలిపారు.

WhatsApp-Image-2025-03-08-at-10.31.00-PM-1024x640 నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవితో జేఎస్పీ గ్లోబల్ టీం జూమ్ సమావేశం
WhatsApp-Image-2025-03-08-at-10.42.09-PM-643x1024 నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవితో జేఎస్పీ గ్లోబల్ టీం జూమ్ సమావేశం
WhatsApp-Image-2025-03-08-at-10.30.59-PM-2-1-1024x640 నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవితో జేఎస్పీ గ్లోబల్ టీం జూమ్ సమావేశం

Share this content:

Post Comment