ఆచార్య విడుదల సందర్భంగా.. దేవిరెడ్డి శ్రీనివాసరావును సన్మానించిన జె.ఎస్.పి రాయల్ సోల్జర్స్

భారతరత్న బిరుదార్హులు, పద్మభూషణ్, మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం విడుదల సందర్భంగా.. ఆచార్య దేవోభవ అనే సిద్ధాంతానికి అనుగుణంగా శుక్రవారం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దేవిరెడ్డి శ్రీనివాసరావు ను గుంటూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో జె.ఎస్.పి రాయల్ సోల్జర్స్ వారు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు నేరెళ్ళ సురేష్, జె.ఎస్.పి రాయల్ సోల్జర్స్ అధ్యక్షుడు అన్నదాసు వెంకట సుబ్బారావు, జనసేన పార్టీ నాయకులు సూదా నాగరాజు, పుల్లంశెట్టి ఉదయ్ కుమార్, సూదా వసంత్ కుమార్, చందు శివ కోటేశ్వరరావు, పులిగడ్డ గోపి, పుప్పాల తేజేంద్ర, గోశాల విజయ్ తదితరులు పాల్గొన్నారు.