రాజద్రోహం కేసులో.. జడ్జి రామకృష్ణకు బెయిల్‌ మంజూరు!

అమరావతి: రాజద్రోహం కేసులో అరెస్టయిన జడ్జి రామకృష్ణకు ఎపి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం.. విచారణాధికాకిరి సహకరించాలని ఆదేశించింది. బెయిల్‌ కోసం రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ.. కేసు అంశంపై మీడియాతో మాట్లాదవద్దని ఆయన్ను ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఎపి ప్రభుత్వం, సిఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై జడ్జి రామకృష్ణపై చిత్తూరు జిల్లా పీలేరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. రామకృష్ణ ప్రస్తుతం పీలేరు సబ్‌జైలులో ఉన్నారు.