అధ్యా కుటుంబానికి న్యాయం చేయాలి: జనసేన వినతిపత్రం

రాజంపేట: రాయచోటి పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటన విదితమే. ఈ ఘటనలో రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన అధ్యా.. వివరాల్లోకి వెళితే అధ్యా తండ్రి వెంకటరమణ కె వి పల్లి మండల వాసి ఆయన పొట్టకూటి కోసం రాయచోటిలో బ్యాటరీలు షాప్ లో పని చేస్తూ ఇంటిని పోషణ సాగిస్తున్నాడు. ఆగస్టు 10వ తారీకు సాయంత్రం ఐదు గంటల సమయంలో తన తండ్రితో పాటు కుమారుడు అఖీరానందన్, కుమార్తె ఆద్య సాయి స్కూల్ నుంచి
ఇంటికి వస్తుండగా మాసాపేట బ్రిడ్జి దాటుతుండగా వెనకవైపు నుంచి వస్తున్న ఆటో డీ కొట్టడంతో రోడ్డుపైన పడిపోవడం జరిగింది. వెనక వైపు నుంచి వస్తున్న
అదే స్కూలుకు సంబంధించిన బస్సు ఆద్య తలపైకి ఎక్కడముతో అక్కడిక్కకడే మృతి చెందింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక ఆటో మీద మాత్రమే కేసు ఫైల్ చేశారు. బస్సు పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆద్య తండ్రి వెంకటరమణకు కనీటి భాద మిగిల్చింది. ఆయన న్యాయం కోసం జనసేన పార్టీ నాయకులను సహాయము కోరగా పీలేరు జనసేన పార్టీ ఇంచార్జ్ దినేష్ మరియు రాయచోటి ఇంచార్జ్ హసన్ భాష, అన్నమయ్య జిల్లా సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్, జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు రియాజ్, ఇతర జనసైనికులతో కలిసి శనివారం జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావును కలిసి అర్జీ ఎస్పీకి అందించగా వారు సానుకూలంగా స్పందించి రీఎంక్వయిరీ చేసి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.