కూటమి తోనే దళితులకు న్యాయం..!

  • ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ విజయ్ కుమార్ కు ఘన స్వాగతం
  • జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో సత్కారం

కూటమి ప్రభుత్వంతోనే దళితులకు న్యాయం జరుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన నెల్లూరుకు వచ్చిన సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక గోమతి నగర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాదిగాను 51.81 కోట్లతో 1240 మందికి లబ్ధి చేకూరే విధంగా పలు యూనిట్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో ఉన్న లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. దీనిలో భాగంగా 20.46 కోట్ల సబ్సిడీ, 28.75 కోట్ల బ్యాంకు రుణాలు గాను 2.59 కోట్ల లబ్ధిదారుల వాటాగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి నుండి మే 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మే 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు.21వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఎంపికైన లబ్ధిదారుల జాబితాను బ్యాంకులకు ఎంపీడీవోలు పంపుతారని చెప్పారు. జూన్ 13 నుండి 20వ తేదీ వరకు ఎంపికైన లబ్ధిదారులకు పరిపాలనాపరమైన ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందన్నారు. జూన్ 21 నుండి ఆగస్టు 9 లోక యూనిట్లు గ్రౌండ్ చేయాల్సి ఉంటుందని నూనె మల్లికార్జున వివరించారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ వారి మాటల్లో రాజకీయ అబ్లిగేషన్లు దాటి 75 సంవత్సరాలుగా నిరాదరణకు గురవుతున్న ఎస్సీ యువతకు సబ్సిడీ లోన్ల విషయంలో వ్యవహరించాలని అధికారులను కోరడం చూస్తే ఇది కదా పవన్ కళ్యాణ్ కలలు కన్న సమాజం అనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుందరామి రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, పి చంద్రశేఖర్, మార్కెట్ సురేష్, జమీర్, సుధామాధవ్, రవి, కృష్ణా రెడ్డి, శ్రీకాంత్, శాంతికల, వర్షాచలం రాజేష్, పి పవన్, తల్లూరి వెంకట్, శ్రీపతి రాము, మనోజ్, మహేష్, పి.శ్రీకాంత్, మరియు జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment