డిజిటల్ అసిస్టెంట్లకు ఎ ఎస్ ఓ ప్రమోషన్‌కు సంబంధించిన ఉత్తర్వులను పునరాలోచించాలని డిజిటల్ అసిస్టెంట్లు కోరుతున్నారు. ఈ మేరకు, నియోజకవర్గానికి చెందిన డిజిటల్ అసిస్టెంట్లు యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ దాసరి రాజుకి వినతిపత్రం అందించారు. వీరిలో 80% మంది బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ వంటి అత్యున్నత విద్యార్హతలు పొంది టెక్నికల్ రంగంలో నైపుణ్యం కలిగినవారే ఉన్నారని, కాబట్టి వారికి టెక్నికల్ వైపు పదోన్నతి కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. సీఎం విజన్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు వీరి మేధస్సు ఉపయోగపడుతుందని, ప్రభుత్వ సహకారంతో న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి గారు మరియు డిప్యూటీ సీఎం గారి పరిరక్షణపై నమ్మకం ఉందని, వారు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై దాసరి రాజు స్పందిస్తూ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూనియన్ సభ్యులు పొల్లాయి అశోక్, పి జగదీష్, లొల్ల విజయ్, డి లోకేష్, నీరజ, డి నవీన్, జయదేవ్, శేషారావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment