పెనుమూరు ఇంటర్ విద్యార్థినికి న్యాయం చేయరా?: డా. పసుపులేటి

  • రాష్ట్ర మహిళా కమిషనా? వైకాపా మహిళా కమిషనా
  • మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ సూటి ప్రశ్న

తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల కోసమే రాష్ట్ర మహిళా కమిషన్ పనిచేస్తోందా? అని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైసీపీ మహిళల కోసమే కమిషన్ పనిచేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. సామాన్య మహిళలకు అన్యాయం జరిగితే మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఎందుకు నోరు మెదపదో సమాధానం చెప్పాలన్నారు. రెండు రోజుల పర్యటన కోసం తిరుపతికి వచ్చిన ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పెనుమూరు ఘటనలో బాధిత విద్యార్థిని కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదో సమాధానం చెప్పాలన్నారు. బాలిక తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నా.. ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయడం లేదనో చెప్పాలన్నారు. వాసిరెడ్డి పద్మ.. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా కాకుండా వైసిపి మహిళా కమిషన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వ్యవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్త శుద్ది ఉంటే పెనుమూరుకు వెళ్లి బాలిక కుటుంబాన్ని పరామర్శించాలని డిమాండ్ చేశారు.