వి.ఆర్.పురం మండలం రేఖపల్లి తాహసిల్దార్ కార్యాలయంలో ఆర్ అండ్ ఆర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి చింతూరు ఐటీడీఎ పీవో అపూర్వ భరత్ హాజరై నిర్వాసితుల సమస్యలను సమీక్షించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. కూటమి నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల వద్దకు ఒక ఐఏఎస్ అధికారి వచ్చి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం హర్షణీయమని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితుల 100% న్యాయం కేవలం కూటమి ప్రభుత్వ హయాంలోనే సాధ్యమని, ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంతో నిస్వార్థంగా సేవలందిస్తోందని వారు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్ అధికారులకు మరియు మండల అధికారులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి సభ్యులు వళ్ల రంగారెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి బొర్ర నరేష్, జనసేన పార్టీ మండల కార్యదర్శి బాగుల అంజనరావు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బీరకా ప్రకాష్ రావు, బొర్ర నరసింహ రావు, ఆకోజు భాగ్యలక్ష్మి, శేఖర్ తదితర కూటమి నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment