దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు జరగని న్యాయం

  • కనీసం మద్దతు తెలుపని అధికార ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు
  • కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం సందిపూడి రైతులు స్థానిక సర్పంచ్ తోట భవాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం 6వ రోజున స్థానిక నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బండారు శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. ఓఎన్జీసీ అధికారులతో చర్చలు విఫలమైన నాటి నుండి దేశానికి వెన్నుముక అయిన రైతన్న నిరసన కార్యక్రమాలు చేస్తున్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార శాసన సభ్యులు కాని, ఎంపీ కానీ కనీసం కన్నెత్తి చూసిన సందర్బం లేకపోవడం విచారమని బండారు శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. రైతులు స్వార్థ ప్రయోజనాలకు కానీ, వ్యక్తిగత కారణాల వల్ల కానీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం లేదని, గ్రామ అభివృద్దికి తోడ్పడే పనులకు తమ కోరికలు చేస్తే ఓఎన్జీసీ అధికారులు లిఖిత పూర్వక హామీ ఇవ్వకపోవడం వారిని అవమానించడమని అన్నారు. గ్రావెల్ రోడ్ నిర్మాణానికి అయ్యే నిధులు 13 లక్షలు రైతులు అడిగినా, ఓఎన్జీసీ అధికారులు ముందుకు రాకపోగా వారి పై అధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్తామంటూ కాలయాపన చేయడం ద్వారా నిత్యం జరిగే వ్యాపార లావాదేవీలకు ఆటంకమని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని బండారు సూచించారు. ఆలమూరు మండలంలో రైతులు ఒక పక్క తమ గోడు తెలిపే విధంగా నిరసనలు వ్యక్తం చేస్తుంటే అధికార ప్రజా ప్రతినిధులు కన్నెత్తి కూడా చూడలేదని, వారు కూడా గ్రామాభివృద్ధి కొరకు నిరసన చేస్తున్న రైతుల పక్షాన నిలబడి ఓఎన్జీసీ అధికారులతో చర్చలు జరిపినట్టు అయితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు లేకపోలేదని బండారు శ్రీనివాస్ అన్నారు. రైతుల సమస్య సమస్యగానే ఉన్నట్టు అయితే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరపున సమస్య ఉదృతం చేసి న్యాయ పోరాటం చేయడానికి ముందుకు వెళ్లే కార్యక్రమం చేపడతాం అని, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బండారు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ల డేవిడ్, సంగీత సుభాష్, గారపాటి త్రిమూర్తులు, తోట వెంకటేశ్వర్లు, తమ్మన భాస్కర రావు, కొత్తపల్లి నగేష్, సూరపరెడ్డి సత్య, సలాది జయప్రకాష్ నారాయణ, తోలేటి సంతోష్, పడాల అమ్మిరాజు, జాప్రోలు నాగేశ్వరరావు, గంగరాజు, నాగిరెడ్డి మహేష్, రైతులు, జనసైనికులు పాల్గొన్నారు.