మైనర్ బాలికకు న్యాయం చేయాలి: ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన విద్యార్థి విభాగం

ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు వెంటనే న్యాయం చేయాలి అని.. అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ సెంటర్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. హైదరాబాద్ లో 17 ఏళ్ల బాలిక పై అత్యాచారం జరిగి 5 రోజులు కావస్తున్నా నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయక పోవడం రాష్ట్ర ప్రభుత్వనికి.. పోలీసు శాఖ వారికి సిగ్గుచేటని.. బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలి అని ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగ కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్, ఎక్సిక్యూటివ్ మెంబెర్స్ గంధం ఆనంద్, కుంపటి పవన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం తరుపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి విభాగ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొండా పవన్ కుమార్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వీర మహిళ విభాగ అధ్యక్షులు బోగ హరిప్రియ, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం నాయకులు కార్తీక్, మణికంఠ, పవన్ కళ్యాణ్, ప్రభాకర్, అజయ్, కొత్తగూడెం జేమ్స్, శ్రీను, మాలిక్, తదితరులు పాల్గొన్నారు.