*బీసీ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించిన ప్రేమ కుమార్
తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను మళ్లీ చేర్చాల్సిన అవసరం ఉందని కోరుతూ, ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో కమిషనర్ జి. నిరంజన్ ని కలిసిన కూకట్పల్లి జనసేన పార్టీ నేత, మాజీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ అధికారికంగా వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014 ఆగస్టు 14న జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్.నెం3 ద్వారా ఈ 26 కులాలను బీసీ జాబితా నుండి తొలగించడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు, హమాళీలు, వీధివ్యాపారులు, నిర్మాణ కార్మికులుగా జీవనం సాగించే ఈ కులాలకు ఉద్యోగాలు, విద్యా అవకాశాలు లభించక 11 ఏళ్లుగా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రస్తుతం వారు నిస్సహాయంగా జీవిస్తున్నారని, వారికి తగిన న్యాయం జరగాలంటే వెంటనే బీసీ జాబితాలో తిరిగి చేర్చాలని కోరారు. బీసీ కమిషన్ ద్వారా ఈ సిఫారసు ప్రభుత్వానికి చేరవేయాలంటూ జనసేన పార్టీ తరఫున గట్టి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, ఎన్. నాగేంద్ర, కలిగినీడి ప్రసాద్, అడబాల షణ్ముఖ, పోలిబోయిన శ్రీనివాస్, మాధవ్, పులగం సుబ్బు, పుష్పలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment