నిరుపేదలకు న్యాయం చేయాలి..

*అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని జనసేన పార్టీ డిమాండ్

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి వెల్టూరు నగేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం నగేష్
మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరుపేదల పార్టీ అని అంటున్నారు. కానీ ఇక్కడే మాత్రం చూస్తే అసలైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇండ్లు భూములు ఉన్నవారికి డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇల్లుమంజూరు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కానీ మాలాంటి నిరుపేదలకు వస్తలేవు అని అంటున్నారు. మా జనసేన పార్టీ తరఫున మేము నిరుపేదలకు అండగా ఉంటాము. స్థానిక ఎమ్మెల్యే ఈ ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను పరిష్కరించి అసలైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించాలని దీనిపై కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment