ర్యాగింగు భూతానికి బలైన మెడికల్ స్టూడెంట్ కు న్యాయం చెయ్యాలి

జయశంకర్ జిల్లా, భూపాలపల్లి, ర్యాగింగు భూతానికి బలైన మెడికల్ స్టూడెంట్ దారావత్ ప్రీతి చిత్రపటానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు
అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు జేరిపోతుల సనత్ కుమార్ మాట్లాడుతూ వరంగల్, కె.ఎం.సి కాలేజీలో మెడికల్ స్టూడెంట్ ప్రీతిని ర్యాగింగ్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైనటువంటి సైఫ్ పై చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాని డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే ఇట్టి విషయంపై ఫాస్ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి త్వరితగతిన నిందితులను చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవాలని అంతే కాకుండా కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకొని భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సనత్ కుమార్ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల నాయకులు జనగాం పవన్ మరియు సాయి తేజ, సాగరిక, ఎం.డి యాకుబ్ పాషా, బన్నీ, రాజేష్, శివకుమార్, చిర్ర సంతోష్ తదితరులు పాల్గొన్నారు.