అన్నమయ్య జలాశయం ముంపు బాధితులకు న్యాయం చేయాలి: రామ శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గం: అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోవడంతో గురై సర్వస్వం కోల్పోయిన బాధితులకు త్వరితగతిని న్యాయం చేయాలని జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ కోరారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపుకు గురైన బాధితులకు ఇంకా ఎత్తైన ప్రాంతంలో గుట్టపై ఐదు సెంట చొప్పున స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం తొగరు పేట మందపల్లి లేఔట్లలో 49 మందికి స్థలాలు కేటాయించగా.. కొండ ప్రాంతంలో నిర్మాణానికి అనుకూలంగా లేవని 120 మంది వాటిని తీసుకోలేదన్నారు. ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ వాటిని పూర్తిగా విడుదల చేయకపోవడంతో ఇళ్ళ నిర్మాణం మందకొడిగా సాగుతుందన్నారు. 135 ఇల్లు గుణాధి దశలోనే ఉండగా మిగిలిన ఇల్లు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఏడాదిన్నర దాటినా ఇళ్ళ నిర్మాణం పూర్తి కాలేదు అన్నారు. ఇల్లు కోల్పోయిన వారిలో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారని, మరికొందరు గుడారాల్లో దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు లేక మహిళలు అవస్థలు పడుతున్నారన్నారు. రాజంపేట మండల పరిధిలో పులపత్తూరు లేఔట్లలో 300 ఇళ్లు మంజూరు అయినప్పటికీ అందులో 150 కుటుంబాల వారు ప్రభుత్వం నుండి డబ్బులు తీసుకొని వారిని నిర్మాణాలు చేసుకుంటున్నారన్నారు. మిగతా 150 కుటుంబాల వారికి హౌసింగ్ బోర్డ్ వారు నిర్మిస్తామని చెప్పి అందులో 75 ఇండ్లు గోడల వరకూ నిర్మాణాలు జరిగాయన్నారు. నందలూరు మండలంలోని తొగురుపేట, రామచంద్రపురం తదితర ప్రాంతాల బాధితులకు ల్యాండ్ జరిగిందని వెంటనే వారికి పునరావసం కల్పించాలని జనసేన తరఫున కోరుతున్నామన్నారు.