జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం మరియు జయకేతనం సభను పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, ఇతర ప్రజలకు పాదగయ పుణ్యక్షేత్రం వద్ద భోజన పంపిణీ కేంద్రం ద్వారా 5,000 మందికి శాఖాహారం అందించామని జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు గర్వకారణమని, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను అనుసరిస్తూ, గత 2 సంవత్సరాలుగా పిఠాపురం పశువుల సంతలో రైతులకు “ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం” ద్వారా శనివారం రోజుల్లో 600 నుంచి 1,000 మందికి భోజనం, త్రాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో వీరమహిళ పిల్లా రమ్యజ్యోతి, కందా శ్రీనివాసు, గుండ్ర సీతారాం, గాది చంద్రరావు, మొగిలి శ్రీను, కొప్పుల చక్రధర్, జ్యోతుల గోపి, మంతెన గణేశ్, చెశెట్టి భద్రం తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment