శ్రీ ఐశ్వర్యసిద్ధి గణపతి వార్షికోత్సవ వేడుకల్లో జ్యోతుల

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం లోని ఏభ్ఛ్ కాలనీలో వెలసిన శ్రీ ఐశ్వర్యసిద్ధి గణపతి స్వామి వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో శ్రీనివాసు గారిని ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఆలయ కమిటీ పెద్దలతో కలిసి గణపతి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ, దుర్గాడ గ్రామంలో ఐశ్వర్యసిద్ధి గణపతి ఆలయం విశేషంగా ప్రాచుర్యం పొందిందని, ఆలయ అభివృద్ధిలో నిరంతర సేవ చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా, ఏభ్ఛ్ కాలనీలో దైవ, సామాజిక కార్యక్రమాలకు తన వంతు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాపారపు వెంకటరమణ, కొసిరెడ్డి ఆదినారాయణ, ఉంగరాల బాబురావు, కుర్రు శ్రీను, గారపాటి మాణిక్యం, ఉంగరాల నాగేశ్వరరావు, కందా శ్రీను, మొగిలి శ్రీను, మంతెన గణేష్, కొప్పుల చక్రధర్, జ్యోతుల గోపి, కొలా నాని తదితరులు పాల్గొన్నారు. జ్యోతుల శ్రీనివాసు ఆలయ అభివృద్ధికి, గ్రామ సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

Share this content:

Post Comment