మేడే‌ వేడుకలలో పాల్గొన్న జ్యోతుల

మేడే ను పురస్కరించుకుని పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో భవననిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహణలో భాగంగా మేడే కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు ను భవననిర్మాణ కార్మిక సంఘం ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం జరిగింది. భవననిర్మాణ కార్మిక సంఘం ఆహ్వానం మేరకు జ్యోతుల శ్రీనివాసు దుర్గాడ గ్రామంలో గల ఆటో స్టాండ్ వద్ద జరిగిన మే డే ఉత్సవాల కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాసు పాల్గొని ముందు భవన‌నిర్మాణ కార్మికుల సంఘం వారు ఏర్పాటు చేసిన మేడే జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మేడే సభలో జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ మేడే ను అంతర్జాతీయ కార్మిక దినోత్సవం చెప్పుకొవచ్చని, మే డే ముఖ్య ఉద్దేశం కార్మికులు కొసం కార్మికుల వారి హక్కుల కోసం పోరాటంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకునే రోజని, ఇది ప్రతి సంవత్సరం మే 1న జరుపుకుంటారని, ఈ రోజును కార్మికుల హక్కులు, మెరుగైన పని పరిస్థితులు, తక్కువ పని గంటల కోసం పోరాటంలో పాల్గొన్న వారిని గుర్తుచేసుకుంటారని మన దుర్గాడ గ్రామంలో జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో భవననిర్మాణ కార్మికులు సంఘంగా ఏర్పడి ప్రతినెల విధిగా సమావేశాలు జరుపుకుంటూ అందరూ కలిసికట్టుగా ఉండడం నాకు ఎంతో గర్వకారణం ఉందని. భవననిర్మాణ కార్మికులు ప్రపంచం పుట్టినప్పటి నుంచి అంటే సుమారు 4500 సంవత్సరాల కన్నా ముందు నుండి భవననిర్మాణ కార్మికుల యొక్క పనితనం ఎంతో గొప్పదని ఉదాహరణకు గత చరిత్రలో ఎన్నో కట్టడాల నిర్మించారని ఆనాడు షాజహాన్ మహారాజు తాజ్ మహల్ కట్టించడం గొప్పకాదని కట్టిన భవననిర్మాణ కార్మికుల గొప్పతనమని తాజ్ మహల్ నిర్మాణం చేసి 377 సంవత్సరాల అయిన కాని నేటికి కొత్తగా నిర్మించినట్టుగా ఉంటుందని ఈ ఘనత భవననిర్మాణ కార్మికులదేనని క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల క్రితం ఏర్పడిన హరప్పా, మొహంజిదరో మరియు కాశి ప్రయోగ వంటి పురాతన నగరాలను అలనాటి భవననిర్మాణ కార్మికులు ఎంతో చక్కగా నిర్మించారని అంటే ఇప్పటికీ సుమారు 4500 సంవత్సరాల అవుతున్న ఆ నిర్మాణాలు ఇప్పటికి చెక్కుచెదరలేదని అదేవిధంగా మన దగ్గరలో కోణార్క్ సూర్యదేవాలయం గాని ఇంకా అనేక దేవాలయాలను భవన నిర్మాణ కార్మికులు చాలా చక్కగా నిర్మించారని వారి యొక్క పనితనానికి తిరుగు లేదని నేడు కూడా మన భవనాలు ఎంతో చాకచక్యంతో కష్టపడి ఎండ అనక నీడ అనక భవన నిర్మాణాలు కొనసాగిస్తున్న తీరు చూస్తే చాలా గర్వకారణం ఉంటుందని కాబట్టి మన గ్రామంలో గల భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి కష్టనష్టాలు వచ్చినా నా దృష్టికి తీసుకు వచ్చినట్లయితే నేను తగువిధంగా సహకరిస్తానని అదేవిధంగా ముందు సంవత్సరం ఇదే మే డే నాడు పంచాయతీ వారు స్థలం కేటాయిస్తే నేను షెడ్డు నిర్మిస్తానని చెప్పాను. ఇప్పటికి స్దలం భవననిర్మాణ కార్మికులు తెచ్చుకొలేదని ఇప్పటికైయిన దుర్గాడ గ్రామ పంచాయతీ నుండి స్దలం కేటాయిస్తే నేను భవననిర్మాణ కార్మికుల సంక్షేమం కొరకు ప్రత్యేకంగా ఒక షెడ్ నిర్మిస్తానని మేడే సందర్భంగా మీ అందరికి హామీ ఇస్తున్నానని నాకు ఈ అవకాశం ఇచ్చిన దుర్గాడ గ్రామ భవననిర్మాణ కార్మికుల అందిరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయుచున్నానని‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుండ్రా సీతరాం,దుర్గాడ భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రెసిడెంట్ ఆకుల అర్జున్, గట్టెం వీరబాబు, సఖినాల ప్రసన్న, గొల్లపల్లి అయ్యన్న, గుండ్రా త్రిమూర్తులు, గుళ్ళ ఏసు, వెలుగుల రాంబాబు, తీడ గంగ, సోర్నంపూడి వీరబాబు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment