చీపురుపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం సంఘసంస్కర్త, నిమ్నవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు, మహిళా విద్యకు ప్రథమ పాఠశాల స్థాపించిన అభ్యుదయవాది మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి జనసేన ఇన్‌చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “చదువు ద్వారా మాత్రమే సమాజం సంస్కరించబడుతుంది” అనే గాఢమైన విశ్వాసంతో అనాధల కోసమై సత్యశోధక్ సమాజ్ స్థాపించి, సమాజ సేవకు తన జీవితం అంకితమిచ్చిన మహనీయుడు జ్యోతిబా పూలే” అని కొనియాడారు. జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గొర్ల మండల అధ్యక్షులు యడ్ల సంతోష్, మీసాల సూరి నాయుడు, కోట్ల శిరీషా రాణి, విక్రం, రమ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment