బొలిశెట్టి జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొన్న జ్యోతుల

విశాఖపట్నం: రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ జన్మదినోత్సవ వేడుకలు ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం నందు ఘనంగా జరిగినవి. పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఎంవీపీ కాలనీలో జరిగిన బొలిశెట్టి సత్యనారాయణ జన్మదినోత్సవ వేడూలలో పాల్గొని బొలిశెట్టి సత్యనారాయణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఆయనకు పూవ్వలబోకెను అందించి, శాలువతో సన్మానించి ఆయనకు జ్ఞాపకం అందజేసి బొలిశెట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ.. బొలిశెట్టి సత్యనారాయణ నిస్వార్ధమైన ప్రజానాయకుడు, పర్యావరణం పట్ల మక్కువతో అనేక ఉద్యమాలను చేపట్టి పర్యావరణాన్ని కాపాడిన ఘనత బొలిశెట్టి సత్యనారాయణకు దక్కుతుందని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల వాసు వీర్ల శ్రీను, జనసైనికులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.