మృతుని కుటుంబానికి జ్యోతుల శ్రీనివాసు సహాయం

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన పడాల సత్తిబాబు మరణించారు. పడాల సత్తిబాబు కుటుంబానికి ప్రధాన సంపాదనపరుడు కావడం వల్ల సత్తిబాబు కుటుంబం తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. చేబ్రోలు గ్రామ జనసేననాయకులు, కార్యకర్తలు ఫోన్ ద్వారా పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసుకు పడాల సత్తిబాబు ఆర్థిక పరిస్థితిని వివరించడం జరిగింది. ఫోన్ సమాచారం విన్న జ్యోతుల శ్రీనివాసు వెంటనే స్పందించి సోమవారం సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో గల పడాల సత్తిబాబు ఇంటికి వెళ్ళి వారి కుమారుడు పడాల బుచ్చిబాబును కలిసి పడాల సత్తిబాబు మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పడాల సత్తిబాబు కుటుంబానికి 25 కె. జి ల బియ్యం, కిరణాసామాన్లు అందించారు. అనంతరం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ఉలిశెట్టి సత్తిబాబు మరణించారు. సోమవారం సాయంత్రం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఉలిశెట్టి సత్తిబాబు స్వగ్రహానికి వెళ్లి ఉలిశెట్టి సత్తిబాబు సోదరుడైన ఉలిశెట్టి రమణని పరామర్శ చేశారు. ఉలిశెట్టి సత్తిబాబు మరణం పట్ల తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేస్తూ, ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిబ్బడి సురేష్, పడాల సురేష్, అల్లం దోరబాబు, దమ్ము చిన్నా, లోకా రెడ్డి సురేష్, సిద్ధ అశోక్, లోకారెడ్డి వరహాలు, పడాల సందీప్, వెలుబంటి దొరబాబు, శివలంక నాగబాబు, చేదులూరి త్రిమూర్తులు, పడాల సతీష్, లోకరెడ్డి సురేష్, కర్రి మహేష్, గంటా గోపి, ఉలవకాయల గణపతి, ఉలవకాయల స్వామి, జ్యోతుల సీతారాంబాబు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *