గణతంత్రదినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజకవర్గం: 75వ గణతంత్రదినోత్సవం సందర్భంగా గొల్లప్రోలుమండలం దుర్గాడ గ్రామ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో నందు గణతంత్రదినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కందా శ్రీనివాస్ అధ్యక్షతన ప్రధానోపాధ్యాయురాలు ఈ రాజ్యలక్ష్మి వారిచే జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుర్గాడ గ్రామ ఉపసర్పంచ్ పంపన సూర్యచంద్రరావు, అతిధిగా జనసేననాయకులు & వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ మన పరిపాలనను మనం ఎలా నిర్వహించుకొవాలనే విధానంతో రాజ్యాంగాన్ని రాసుకొని ఆ రాజ్యాంగాన్ని 1950వ సంవత్సరంలో జనవరి 26వ తేదీ నుంచి రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం జరిగింది. మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగానికి నిబద్ధులై మన సమాజ అభివృద్ధి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు పి రాజ్ కుమార్, పోసిన సోమన్నదొర, కొప్పుల సుబ్రహ్మణ్యం, నాగళ్ళ శ్రీనివాస్, కొయ్య సూర్యనారాయణ, కెసంపత్, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, గొల్లపల్లి గంగబాబు, శాఖ సురేష్, కుమ్మరి గంగేశ్వరుడు, యదాల అప్పారావు, గంపల శివ, కుర్రు అప్పారావు, చేశెట్టి భద్రం, ఆకుల వెంకటస్వామి, మంతెన గణేష్, మేడిబోయిన హరికృష్ణ, విప్పర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.