పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజవర్గం, గొల్లప్రోలు నగరం, గొల్లప్రోలు మండలం నందు పలు కార్యక్రమాల్లో పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు పాల్గొన్నారు.

  • గొల్లప్రోలు నగర పంచాయతీకి చెందిన యోగా గురువు జ్యోతుల నాగేశ్వరరావు నూతన గృహప్రవేశకార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ యోగ విద్య ద్వారా అనేకమందికి ఆరోగ్యం చేకూర్చుతున్నారని జ్యోతుల నాగేశ్వరరావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు కొసిరెడ్డి రాజా, కర్రి కొండలరావు, బండి శివ,
    మేడిబోయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
  • గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం శ్రీకృష్ణ ఆలయం నందు ఆదివారం ఉదయం 11 గంటల నుండి ఉచిత అన్నదాన కార్యక్రమం ఆలయకమిటి వారు గ్రామ ప్రజల, గ్రామపెద్దల సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాసు పాల్గొని ఉచిత అన్నదాన కార్యక్రమంలో బోజనం చేశారు.ఈ కార్యక్రమంలో కొమ్మూరి కృష్ణ, నాగళ్ళ‌ కృష్ణమూర్తి, నాగళ్ళ దాసు, రావుల రమణ, జ్యోతుల గోపి, కొటికలపూడి వెంకటరమణ, బండి శివ, మేడిబోయిన నాగేశ్వరరావు, జ్యోతుల చిన్నయ్య, బండిశివ,
    మేడిబోయిన హరికృష్ణ, బారీ స్దాయిలో దుర్గాడ గ్రామప్రజలు తదితరులు ఉన్నారు.
  • జనసేన రాష్ట్రరాజకీయ వ్యవహారాలకమిటీ సభ్యులు మరియు కాకినాడ-2 జనసేన ఇన్చార్జి పంతం నానాజీ ఆరోగ్యం బాగుండాలని కాకినాడ-2 నియోజకవర్గం కాకినాడ నుంచి అన్నవరం వరకు పాదయాత్ర చేస్తున్న జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు, జనసైనికులకు, వీరమహిళలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం పర్వతవర్ధిని ఉమారామలింగేశ్వర ఆలయం వద్ద పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాదయాత్రికులకు వాటర్ బాటిల్లు, గ్లూకోస్ బాటిల్లు వారికి అందించారు‌. అనంతరం వారు భోజన విరామానికి ఆగడం జరిగింది. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ పంతం నానాజీ ఆరోగ్యం మెరుగుపడాలని పాదయాత్ర చేయడం ఎంతో అభినందనీయమని వారి సేవలను కొనియాడారు. సందర్భంగా పంతం నానాజీ మంచి వ్యక్తి, మృదు స్వభావి, రాజకీయ దురంధరుడు ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ఈ సందర్భంగా భగవంతుని కొరిప్రార్దించారు. ఈ కార్యక్రమంలో మదారపు తాతాజీ, నున్న గణేష్ నాయుడు, దమ్ము చిన్నా, దిబ్బడి సురేష్, దుర్గాడ ఎంపిటిసి అభ్యర్థి మేడిబోయిన సత్యనారాయణ, శాఖ సురేష్, కొప్పన రమేష్, జ్యోతుల గోపి, మొగిలి‌ శ్రీను, కీర్తి చిన్నా, మంతిన గణేష్, తోగరస్వామి, మేడిబోయిన శ్రీను, బండి శివ, మేడిబోయిన హరికృష్ణ తదితరులు ఉన్నారు.