తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జ్యోతుల

పిఠాపురం నియోజకవర్గం: కాకినాడ జి.ఆర్.టి గ్రాండ్ హోటల్ నందు ఆదివారం పిఠాపురం నియోజవర్గం జనసేన పార్టీ ఇన్చార్జిగా నియమితులైన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ని పిఠాపురం నియోజకవర్గం సాయి ప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు జ్యోతుల శ్రీనివాసు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియజేశారు‌‌. అనంతరం తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ని శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ.. పిఠాపురం నియోజవర్గం జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను నియమించడం శుభ పరిణామం అని అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరుపున ఎవరికి టిక్కెట్ ఇచ్చినా, ఇన్చార్జి ఎవరి నియమించినా కాని పార్టీకి కట్టుబడి పని చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ జనసేన అధ్యక్షులు బుర్ర సూర్య ప్రకాష్, జ్యోతుల సీతారాం బాబు తదితరులు పాల్గొన్నారు.