‘కబ్జ’ థీమ్‌ పోస్టర్‌

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న తాజా సినిమా ‘కబ్జ’. శ్రీధర్ లగడపాటి సమర్పణలో శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 నుండి 1980 మధ్య కాలంలో సాగే కథతో, అండర్‌వరల్డ్ నేపథ్యంలో.. భారీ బడ్జెట్‌తో ఏడు భాషల్లో పాన్ ఇండియన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం థీమ్‌ పోస్టర్‌ను రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు.

ఇక థీమ్‌ పోస్టర్‌ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ‘ఓం’, ‘ఎ’, ‘రా’… ఇలా వైవిధ్యమైన, విలక్షణ కథలతో ఉపేంద్ర పాత్ బ్రేకింగ్ మూవీస్ చేశారు. చూస్తుంటే ఈ చిత్రం కూడా అదే తరహాలో ఉపేంద్రకు గుర్తింపు తెచ్చే చిత్రంగా కనిపిస్తుంది. థీమ్‌ పోస్టర్‌లో గన్స్‌తో పాటు గుట్టలుగుట్టలుగా శవాలు పడిఉన్నాయి. ఉపేంద్ర బండి మీద వస్తున్న రెట్రో లుక్‌తో పాటు, డాన్‌ లెవల్‌లో ఉన్న రాయల్‌ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. మాఫియా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో విడుదల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ పేర్కొంది.