జాతీయ రైతు దినోత్సవంలో పాల్గొన్న కదిరి శ్రీకాంత్ రెడ్డి

కదిరి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గంలోని తిమ్మాపురం గ్రామంలో పంట పొలాలను సందర్శించి స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను, కష్టాలను తెలుసుకున్నారు. శ్రీకాంత్ రెడ్డితో రైతులు మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామం మొత్తం సుమారుగా 600 ఎకరాలలో పత్తి పంట వేసి చాలా నష్టపోయామని, పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సరైన సబ్సిడీ పథకాలు లేక, సరైన విత్తనాలు లేక, రైతులు చాలా నష్టపోతున్నారని వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, పట్టణ అధ్యక్షులు నర్సింహచారి, గోపాల్, అయుబ్, మణికంఠ, రసూల్, రమణ, నాగార్జున, శివ, పవన్, సాయి, బాషా, రాజేంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.