బండ్రెడ్డి రామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కైకలూరు జనసేన నాయకులు

ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మార్చి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బండ్రెడ్డి రామ్ మాట్లాడుతూ 14 న జరిగే ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్ల, జనసమీకరణ గురించి కైకలూరు నియోజకవర్గం నుంచి భారీగా తరలిరవాలని బెల్లంకొండ వెంకన్న బాబు, అబ్బిశెట్టి నాగబాబుకు దిశా నిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు విరంకి వెంకటేశ్వరరావు, వేల్పూరీ నానాజీ, సిరిపురపు రాజిబాబు, ముమ్మరెడ్డి నాగమల్లేశ్వరరావు, మైగాపుల రామాంజనేయులు, చెన్నంశెట్టి నందకిషోర్, లీగల్ ప్రతినిధి తణుకుల రవితేజ, భావిశెట్టి మణికంఠ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment