కాకినాడ సిటి జనసేన నగర స్థాయి విస్తృత సమావేశం

కాకినాడ సిటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నగర స్థాయి విస్తృత సమావేశం జరిగినది. ఈ సమావేశంలో రాబోయే 10వ తేదీనుండీ మొదలుకాబోతున్న క్రియాశీల సభ్యత్వ-2023 నమోదు కార్యక్రమ నిర్వాహణా ఏర్పాట్లపైన మరియు వై.సి.పి ప్రభుత్వ వైఫల్యాలమీద చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటి ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ ముఖ్య అతిధిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసారు. ముత్తా శశిధర్ జనసేన శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల సంక్ష్యేమం దృష్టిలో పెట్టుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించడం జరిగిందని, దానికి అనుగుణంగా తమ సిద్ధాంతాలు, మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో క్రియాశీలక సభ్యుల పాత్ర చాలా కీలకమైనదని, అలాగే అలాంటి సభ్యుల భద్రత కూడా పార్టీకి చాలా ముఖ్యమని పవన్ కళ్యాణ్ గారు ప్రమాద భీమాని సభ్యత్వంతో లింక్ చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం ఆయన తన సంపాదనలోంచి కోట్లాది రూపాయలను వెచ్చించడం దీనికి ఉదాహరణ అని కొనియాడారు. ఇప్పటివరకు దురదృష్టవశాత్తూ ప్రమాదంలో గాయపడిన మరియు మరణించిన సుమారు వందలాది మంది క్రియాశీల సభ్యుల కుటుంబాలకు కోట్లాది రూపాయలు భీమా మొత్తం అందడంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా కాపాడుకోడం జరిగిందని తెలియచేసారు. శశిధర్ మాట్లాడుతూ నేడు ఈ వై.సి.పి ప్రభుత్వం పాలన వల్ల ప్రజలు దారుణంగా మోసపోతున్నారనీ, ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం అని చెప్పి నగరానికి దూరంగాను కొన్ని, కొన్ని ఎక్కడ ఉన్నయో లే-అవుటు కూడా చూపెట్టకుండా కాయితాలను ఇచ్చి మసిపూసి మారేడుకాయ లాగ మభ్యపెడుతున్నారని, అమ్మవొడి, పించను పధకాలలోని అర్హులను వివిధ రకాల తప్పుడు కారణాలతో అనర్హులుగా చేసి సహాయాన్ని నిలుపుదల చేస్తున్నారని, ఇలాంటి మరెన్నో ప్రజాకంటక పాలనా విధానాలను ప్రజలందరికీ చెప్పి, ప్రభుత్వాన్ని ఎండగడుతూ పోరాటాలు చేయాలని, తద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొని రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్ష్యుడు సంగిసెట్టి అశోక్, రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ, సిటి వైస్ ప్రెసిడెంట్ ఓలేటి రాము, మాజీ కార్పోరేటర్ ర్యాలి రాంబాబు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.