ఇప్పటం హామీ నెరవేర్చినందుకు హర్షం వ్యక్తం చేసిన కాకినాడ సిటి జనసేన

కాకినాడ సిటి, జనసేన ప్రధాన కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటం గ్రామంలోని ప్రభుత్వం అన్యాయంగా రోడ్ల విస్థరణ పేరుతో నిర్మాణాలను కూల్చివేతకు గురి అయిన గ్రుహస్థులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందచేయడం కాకినాడ సిటి జనసేన పార్టీ హర్షాన్ని వ్యక్తం చేస్తూ మాట తప్పను, మడమ తిప్పను అంటే సరైన అర్ధం ఇదని అన్నారు. ప్రభుత్వం అంటే పేద ప్రజలకు సంక్షేమాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించేదని అంతే కానీ ఎదుటివాళ్ళు చేసే మంచి పనులని అవహేళన చేసేది కాదని తెలుసుకోవాలన్నారు. మా నాయకులు పేదలకు బాధితులకు సహాయం చేస్తే వీళ్ళకొచ్చిన నొప్పి ఏంటో తెలియడంలేదంటూ, అసలు బి.సి ల సంక్షేమానికి ఎంత సహాయం అందించారు, మైనారిటీలకు దుళన్ పధకానికి ఎంత కేటాయించారు, పంపిణీ చేసారు వీటన్నిటిపైనా శ్వేతపత్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఇది మానేసి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న చందంగా తమ నాయకుడుపై విమర్శలు చేసి వారి అధిష్టానం దగ్గర మార్కులు పొందాలని చూస్తే ప్రజల్లో అపహాస్యం పాలు తప్పదని, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియచేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, జనసైనికులు అడబాల సత్యన్నారాయణ 9వ డివిజన్, దారపు సతీష్, ఎండి. కస్మూర్ 33వ డివిజన్, చీకట్ల వాసు 36వ డివిజన్, 43వ డివిజన్ ప్రెసిడెంట్ చోడిసెట్టి శ్రీమన్నారాయణ, నరం మణికంట మరియు వీరమహిళ హైమావతి తదితరులు పాల్గొన్నారు.