నిరుపేద కూటుంబానికి చేయూతనిచ్చిన కాకినాడ సిటి జనసేన

కాకినాడ సిటీ, శ్రీ డొక్కా సీతమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో సూర్యనారాయణపురం గొల్లపేట చర్చివెనక నివసిస్తున్న అరుణ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతుందని తెలిసి కాకినాడ సిటి జనసేన పార్టీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ కి ఈ విషయం చెప్పగా ఒక నెలకు సరిపడా కిరాణా మరియు 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, రాము, ఉదయ భాస్కర్, సుమంత్, సతీష్, మాలతి, శిరీష, చిట్టూరి మౌనిక్, ముత్యాల దుర్గాప్రసాద్ చిన్నారి శివ, సాయి, సదాశివ్ వీరబాబు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.