జి.పి.టి కాలేజీ వద్ద కాకినాడ సిటి జనసేన నిరసన

కాకినాడ సిటి, శనివారం ఉదయం కాకినాడ సిటిలో ద్వారకానగర్ నందుగల జి.పి.టి కాలేజీ వద్ద కాకినాడ సిటి జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ సూచనలతో జనసేన పార్టీ శ్రేణులు జి.పి.టి కళాశాల స్థలాన్ని వైద్యశాల నిర్మాణం కోసం సేకరించడంపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. 60 ఏండ్ల కిందట పేద, బడుగు, బలహీన వర్గాల బాలికలను సాంకేతిక విద్యలో నైపుణ్యం పొంది తద్వారా సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఏర్పాటు చేసిన గరల్స్ పాలిటెక్నిక్ కళాశాలను నిర్వీర్యం చేసే దిశగా ఆ ప్రాంగణంలో కొంత భాగాన్ని ఆసుపత్రుల కోసం కేటాయించిన విధానాన్ని ఖండించారు. అసలు ఈ కళాశాల ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా పాలిటెక్నిక్ కళాశాల అని, ఇందులో చదువుకునేందుకు వివిధ ప్రాంతాల విధ్యార్ధినులే కాక నేపాల్ వంటి దేశాల నుండి కూదా వచ్చి చదువుకునేవారని ఈసందర్భంగా ముత్తా శశిధర్ గుర్తుచేసారు. అలాంటి కళాశాలకు చెందిన స్థలములో ఇతర కార్యకలాపాలను చేపట్టడం అంటే విధ్యార్ధినుల భద్రతలను విస్మరించడమే అని, ఇలాంటి పనులవల్ల మహిళా విధ్యార్ధులు అభద్రతకు లోను అయ్యి, ఆసక్తి వున్నా చేరలేరని, ధైర్యం చేసి చేరినా ఏకాగ్రత కోల్పోతారని దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. అసలు ఈ నిర్ణయం తీసుకునేముందు ప్రజాభిప్రాయాన్ని సేకరించారా అని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ సిటి అధ్యక్షుడు సంగిసెట్టి అశోక్ మరియు కాకినాడ సిటి జనసేన పార్టీ నాయకులు వీరమహిళలు మాట్లాడుతూ… ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటుచేసిన మహిళా పాలిటెక్నిక్ కళాశాలను కొత్త కోర్సులతో అభివృద్ధి చేయడం మాని అత్యవసరం అనే కారణంతో ప్రాంగణాన్ని తగ్గిస్తూ తద్వారా పేద, బడుగు, బలహీన విధ్యార్ధినుల మాన, ప్రాణాల రక్షణకు భంగం వాటిల్లేలా చర్యలు ఉపక్రమించడం దారుణమని వీటిని ఉపేక్షించమని అన్నారు. ప్రభుత్వం ఈ ఆలోచనలను ఆపకపోతే నిరసన కార్యక్రమాన్ని ఉదృతం చేస్తామని తెలిపుతూ కళాశాల ప్రిన్సిపాల్ కి మెమరాడం అందచేసారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, జిల్లా వైస్- ప్రెశిడెంట్ సుంకర కృష్ణవేణి మరియు వీరమహిళా నాయకులు బట్టు లీల, మరియు భారతి, పెద్దిరెడ్డి సంతోషి, దారపు శిరీష, రమణమ్మ, ముత్యాల శివ కుమారి, మాలతి, భవాని, ఉమ తదితరులు పాల్గొన్నారు.