కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో జనసేన సై

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో జిల్లా సంయుక్త కార్యదర్శిబడే కృష్ణ ఆధ్వర్యంలో “జనసేన సై” అనే వినూత్న కార్యక్రమం యాళ్ళ నాగేశ్వరరావునగర్, రంపం మిల్లు ప్రాంతంలో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ చెత్త పనులతో, చెత్త పాలనతో, మనతోను మన జీవితాలతోను ఆడుకుంటున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్రా అని అంటున్నాడనీ మరి ఇలాంటి ముఖ్యమంత్రికి ప్రజలు ఆటమొదలెడితే ఎలా ఉంటాదో మనందరం కలిసి చూపించాలన్నారు. మన ఇంట్లో పిల్లల చదువుల్లో స్కూళ్ళు విలీనం అని దూరం ఉన్న స్కూళ్ళకు పంపి వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు, మన ఇళ్ళలోని పెద్దల జీవితాలతో పింఛను ఆలస్యం చేస్తు పెంచుతామన్నది దఫదఫాలు అంటూ ఆడుకుంటూ, ప్రతి ఇంటి నుండీ చెత్తపై పన్ను అని వసూలు చేస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే అంతేలేదు చాంతాడులా సాగుతుందన్నారు. ఇంతదారుణంగా ఆడుతూ బాధ్యత లేకుండా ఆడుదాం ఆంధ్ర అని ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చేపడుతుంటే అందుకే నేను ఈరొజునుండీ పిలుపునిస్తున్నా జనసేన సై అంటూ ఈ చెత్త ప్రభుత్వంపై ఆటాడుదాం అని. పిల్లలకు ఇస్తున్న అమ్మఒడిలో రెండువేలు బాత్రూములు మరియు పారిశుధ్య పనులుకంటూ తగ్గిస్తున్న ఈ ప్రభుత్వంపై ఆటాడుదాం సై అంటున్నా ఈ జనసేన సై కి మీ మద్దతునీయండని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, మండపాక దుర్గాప్రసాద్, ఆకుల శ్రీనివాస్, మనోహర్లాల్ గుప్తా, వారి పెళ్లి ప్రసాద్, వెంపల దుర్గాప్రసాద్, గోగు సతీష్, గంపల ప్రసాద్, దారపు సతీష్, బోడపాటి మరియ తదితరులు పాల్గొన్నారు.