కాళ్ళ మండలం జనసేన పార్టీలో చేరికలు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-29-at-1.11.29-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-29-at-3.39.52-PM-1024x576.jpeg)
కాళ్ళ మండలం ముఖ్య నాయకులు, కాళ్ళ మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు కోమటిగుంట మాజీ సర్పంచ్ శ్రీ ఎరుబండి రామాంజనేయులు (రాము) జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కొటికలపూడి గోవిందరావు(చినబాబు), ఫాఛ్ మెంబెర్ ఉండి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కనకరాజు సూరి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అవటం జరిగింది. ఈ సందర్భంగా కాళ్ళ మండలం నుండి 100 మంది తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల చంద్రశేఖర్, దొడ్డనపూడి సర్పంచ్ శ్రీ కొల్లి సుబ్బారావు, ఆకివీడు మండల అధ్యక్షులు కొటికలపూడి తాతాజీ, ఉండి మండల అధ్యక్షులు యడవల్లి వెంకటేశ్వరరావు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.