కాల్వ పూడిక తీత..!

నరసాపురం పరకాల శేషావతారం కాల్వ పనులు ఆదివారం పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ గుబ్బల మార్రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కాలువపై శ్రద్ధ చూపకపోవడంతో కాలువ మొత్తం పూడి పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆదేశాల మేరకు తీర ప్రాంతాలకు సాగు, త్రాగు నీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకునన్నటు తెలిపారు. నరసాపురం నుండి పితాని వారి మెరక వరకూ మూడు కిలోమీటర్లు పూడిక తీత పనులు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల ప్రజలకు సాగునీరు, తాగునీరు సమృద్ధిగా అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు పనుల్లో అలసత్వం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

Share this content:

Post Comment