ఓటీటీలో విడుదల కానున్నకళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో మళ్లీ గత ఏడాది ఉన్న పరిస్థితులు నెలకొంటున్నాయి. థియేటర్లు మూతపడడంతో చిన్న సినిమాలు ఓటీటీలను ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికే అనసూయ నటించిన ‘థ్యాంక్ యూ బ్రదర్’ అనే చిత్రం ఆహాలో విడుదలకు సిద్దం కాగా, ఇప్పుడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి’ కూడా ఆహాలో రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం. ఈ మూవీలో రచితా రామ్‌తో పాటు ఒక కీలక పాత్రలో అజయ్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.