ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కమలహాసన్

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన క్రేన్ ప్రమాదంలో నలుగురు సాంకేతిక నిపుణులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన అ నలుగురి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఇస్తాను అని ఆ ప్రమాదం జరిగిన సమయంలో కమల్ హాసన్ ప్రకటించారు. అయితే, ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) సంస్థ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి అ నలుగురి కుటుంబాల పెద్దలకు కమల్ హాసన్ కోటి రూపాయలు చెక్ ను అందజేశారు.