టిడిపి రాష్ట్ర బంద్ కు కంచికచర్ల జనసేన మద్దతు

నందిగామ నియోజకవర్గం: జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరియు ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి. రామకృష్ణ సూచనలు మేరకు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా సోమవారం నందిగామ నియోజకవర్గ, కంచికచర్ల మండల జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న నిరసన, బంద్ కార్యక్రమాలలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్, మండల ప్రధాన కార్యదర్శి దేవీరెడ్డి అజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.