నల్లల రామకృష్ణపై దాడిని ఖండించిన కందుల దుర్గేష్

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు, జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణపై జరిగిన దాడిని కండిస్తూ జిల్లా పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు మన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు ఆయనని పరామర్శించి మీకు జరిగిన అన్యాయాన్ని పార్టీ పెద్దలు దగ్గరకి తీసుకెళ్లి జనసేన పార్టీ మొత్తం మీకు అండగా ఉండేలా చేస్తామని భరోసా ఇచ్చి పోలీస్ వారితో దీనిపై ఎంక్వయిరీ చేయించి మీకు న్యాయం జరిగేలా చూస్తామని ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సంయుక్త కార్యదర్శి దసం శేషారావు, మేరకచమవరం అధ్యక్షుడు కృష్ణ అర్జున్, కొంతంగి గ్రామ వార్డు నెంబర్ వేణు మరియు ఇతర జనసేన పార్టీ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.