శరన్నవరాత్రి ఉత్సవములలో పాల్గొన్న కందుల దుర్గేష్

రాజమండ్రి: శరన్నవరాత్రి ఉత్సవములు ప్రారంభం సందర్భంగా జనసేన పార్టీ రాజమండ్రీ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, కార్యదర్శి జి. రాజేశ్వరి, ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, కాతెరు గ్రామం మల్లయ్యపేటలో దుర్గమ్మ వారిని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, రూరల్ మండల అధ్యక్షులు సి హెచ్. చిన్నారావు దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె. ప్రసాద్, జి. తేజ, బి. అప్పారావు, జి. శివ ప్రసాద్, ఉత్సవ కమిటీ సభ్యులు, అత్యధికంగా భవానీలు పాల్గొన్నారు.