నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కందుల, పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం మండలం, గేదెలంక గ్రామానికి చెందిన గుద్దటి నాగరాజు రాజమండ్రి నందు నూతన గృహప్రవేశమునకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ హాజరైనారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొలకుటి వెంకటేశ్వరరావు, దూడల స్వామి, పితాని రాజు మొదలగు వారు పాల్గొన్నారు.