పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలో పర్యటించిన కందుల దుర్గేష్

తూర్పుగోదావరి జిల్లా, దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలో సోమవారం జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పర్యటించడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి నివేదస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.