షూటింగ్ లొకేషన్ ఫోటోలు షేర్ చేసిన కంగనా

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలి బయోపిక్ ‘తలైవి’ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. ఇటీవలే కంగనా సౌత్ ఇండియాకు వెళ్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. దాదాపు ఆరు నెలల తర్వాత షూటింగ్ స్పాట్‌లో అడుగుపెట్టిన కంగనా రనౌత్ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ మూవీ చిత్రీకరణలో పాల్గొంది. అయితే లొకేషన్‌లో ఏదో సీన్‌కు సంబంధించి దర్శకుడు ఏఎల్ విజయ్‌తో డిస్కస్‌ చేస్తున్న కంగనా ఆ ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నిన్న ఉదయం సీన్ డిస్కషన్‌లో దిగిన ఫోటోస్ ఇవి. ప్రపంచంలో అత్యద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కాని నాకు చాలా కంఫర్ట్‌గా ఉన్న స్థలం మూవీ సెట్ అంటూ కంగనా తన పోస్ట్‌కి కామెంట్ రూపంలో పెట్టింది.

జయలలిత జీవిత నేపథ్యంలో కంగనా రనౌత్.. తలైవా అనే చిత్రం చేస్తుండగా, ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది . జయలలిత జీవితంలో కీలకమైన వ్యక్తి ఎం.జి.రామచంద్రన్ కాగా, ఆ పాత్రలో అరవింద్‌ స్వామి నటిస్తున్నాడు. మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.