గాంధీ మహాత్మునికి కనిగిరి జనసేన ఘన నివాళులు

కనిగిరి మండలంలోని కనిగిరి టౌన్ లో గాంధీ జయంతి సందర్భంగా సోమవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీజికి జనసేన పార్టీ కనిగిరి మండలం కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే కనిగిరి టౌన్ లోని పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి గాంధీజీ విగ్రహనికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, నియోజవర్గ సమన్వయకర్త రహీముల్లా, కనిగిరి మండల అధ్యక్షుడు ఇండ్ల రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.