అంగన్వాడీల నిరవధిక సమ్మెకు కనిగిరి జనసేన సంఘీభావం

కనిగిరి: ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు మరియు కనిగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికుటి నాగరాజు సూచన మేరకు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రహీముల్లా ఆధ్వర్యంలో కనిగిరిలో అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్లు నిరవధికంగా గత 30 రోజుల నుంచి చేస్తున్న ధర్నా కార్యక్రమానికి కనిగిరి జనసేన పార్టీ తరఫున సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనిగిరి మండల అధ్యక్షులు ఇండ్ల రమేష్, కనిగిరి పట్టణ నాయకులు మాచర్ల అంజి నాయుడు, ప్రేమ్ కుమార్, ఇమ్రాన్, చంటి, సలీం, వంశీ, లాయర్ అనిల్, మల్లికార్జున, ఖాజా తదితరులు పాల్గొన్నారు.