గుంటూరు: స్వాతంత్ర సమరయోధులు, పుల్లరి ఉద్యమ నాయకుడు కన్నెగంటి హనుమంతు జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. శనివారం కన్నెగంటి హనుమంతు 103వ వర్ధంతి సందర్భంగా శ్రీనివాసరావుతోటలోని అయన విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో వర్షాభావంతో పంటలు పండక పోయినా శిస్తు కట్టాలంటూ గ్రామాధికారులు, బ్రిటిష్ పాలకులు ప్రజల్ని పీక్కుతినేవరన్నారు. రెండు రూపాయలు ఇస్తే కానీ మేకల గడ్డి కోసం అడవిలోకి అనుమతి లేదంటూ నిరంకుశంగా ప్రవర్తించేవారన్నారు. బ్రిటీష్ పాలకుల ఆటవిక విధానాలతో ప్రజలు ఎదురుకుంటున్న నరకయాతన నుంచి, బానిసత్వం నుంచి విముక్తి చేసేందుకు కన్నెగంటి హనుమంతు పుల్లరి ఉద్యమాన్ని చేపట్టారన్నారు. నీకెందుకు కట్టాలిరా శిస్తూ నారు పోశావా, నీరు పోశావా, దుక్కి దున్నావా అంటూ బ్రిటీష్ వారిపై కన్నెగంటి కత్తి దూసి ప్రాణాలకు తెగించి పోరాటం సాగించారన్నారు. బ్రిటీష్ పాలకుల తుపాకులకు తన గుండెను చూపించి కాల్చుకోండి అంటూ స్వతంత్ర్యం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన కన్నెగంటి హనుమంతు స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో రెల్లి నేత సోమి ఉదయ్ కుమార్, మెహభూబ్ భాష, వడ్డె సుబ్బారావు, స్టూడియో బాలాజీ, ఆలా కాసులు, సాయి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment