వైసీపీ పార్టీకి కాపు-బలిజ సంఘాలు మద్ధతు ఇవ్వడం మహానేరం: వబ్బిన సన్యాసినాయుడు

శృంగవరపుకోట, కాపులు అంటే రక్షణకు మారు పేరు. దళితులు, బిసి, ముస్లిం సోదరులను హత్యలు చేసి డోర్ డెలివరీ చేసే వైసీపీ పార్టీకి కాపు బలిజ సంఘాలు మద్ధతు ఇవ్వడం మహానేరం. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పిన వ్యక్తి జగన్ కాపు కార్పొరేషన్ నిధులు పక్కదారి మళ్లించి కాపులకు ఇచ్చే సంక్షేమ పధకాలను కూడా కార్పోరేషన్ నిధులలో లెక్కలు చూపించి కాపులను మోసం చేసిన వ్యక్తి జగన్ ఈ.డబ్లు.ఎస్ రిజర్వేషన్లు కాపులకు ఇచ్చిన కోటను రద్దు చేసిన జగన్ ని కాపు పెద్దలు ప్రశ్నించాలి. కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన క్రిమినల్ జగన్ వైసీపీ ఆంధ్రప్రదేశ్ కి ప్రమాదం. వైఎస్సార్ ప్యాకేజీ ఫ్యామిలీని వచ్చేఎన్నికల్లో ఓడించి జనసేన-టిడిపి కూటమికి మద్దతు ఇవ్వాలని అందరికీ విజ్ఞప్తి. ఏపిలో రాక్షస, దోపిడీ పాలన అంతం కాపుల పంతం కావాలని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ విజయ నగరం జిల్లా అధ్యక్షులు వబ్బిన సన్యాసి నాయుడు అన్నారు.