కర్ణాటక పవర్ స్టార్ ఫాన్స్ సేవా సంఘ కార్యవర్గ సమావేశం

అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం కార్యవర్గం సమావేశం సోమవారం సేవా సంఘం ఆధ్వర్యంలో చీకుబలపురు జిల్లా, గౌరిబిదనూరు తాలూకాలో నిర్వహించడం జరిగింది. రానున్న ఆంద్రప్రదేశ్ ఎన్నికలలో జనసేన పార్టీ కి అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం ఏవిధంగా సేవలు అందించాలని కార్యవర్గం సభ్యులు రాష్ట్ర నాయకులు కార్యకర్తలు చర్చించారు. రాష్ట్ర నాయకులు రానున్న 6 నెలల కాలంలో ఆంద్రప్రదేశ్ లోనే ఉంటూ జన సేన పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు, తాలూకా కార్యకర్తలు పాల్గొన్నారు.