10 గ్రామాల్లో 10వేల ఎకరాల భూమికి నీరు అందించిన కార్తి

కోలీవుడ్ సోదరులు సూర్య-కార్తి వీరి నటనకు తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. నటనలోనే కాదు సాయం చేయడంలోనూ తండ్రి శివకుమార్ అడుగు జాడల్లోనే ఈ ఇద్దరు నడుస్తున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ ఇద్దరు ముందుకొచ్చి సాయం ప్రకటిస్తున్నారు. అంతేకాదు ఈ ఇద్దరు వేర్వేరు సేవా సంస్థల స్థాపించి పలువురికి సాయం చేస్తున్నారు. ఈ నేపధ్యం లో కార్తి తాజాగా 10వేల ఎకరాలకు  నీరు అందేలా చేశారు.

రైతుల కోసం ఉళవన్ అనే ఫౌండేషన్‌ని స్థాపించిన కార్తి.. ఇప్పటికే వారి కోసం పలు కార్యక్రమాలను చేపట్టారు. ఇక తాజాగా 4 లక్షలను ఖర్చు చేసి ఉద్రపురం, తిరునెల్‌వెలి జిల్లాలోని శూరావళి కాలువను 13 కి.మీ. వరకు పూడిక తీయించి మరమత్తులు చేయించారట. ఈ మరమ్మత్తులు చేయడానికి 21 రోజులు పట్టగా.. త్వరలోనే పూర్తికా నున్నాయి.

ఇక ఈ కాలువ వలన 10 గ్రామాల్లో దాదాపు 10వేల ఎకరాల భూమికి నీరు అందుతుంది. దీంతో కార్తిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రైతులను పలు ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉంటే, కార్తి ముందుకొచ్చి వారికి సాయడం అభినందించదగ్గ విషయమని పలువురు అంటున్నారు. అయితే రైతుల కోసం కార్తి ముందుకు రావడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ అనేక మార్లు వారికి అండగా నిలిచారు.