ఘనంగా కార్తీక్ మీడియా ప్రారంభోత్సవం

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండల టౌన్ పరిధిలో స్వామి థియేటర్ జంక్షన్ వద్ద కార్తీక్ మీడియా ఓపెనింగ్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వీరఘట్టం మండల టీడీపీ అధ్యక్షులు ఉదయాన ఉదయ్ భాస్కర్, తెలుగు యువత అధ్యక్షులు మాచర్ల అనిల్ బాబు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మత్స పుండరీకం, రత్నాకర్ మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతేకాకుండా, మిమిక్రి మాస్టర్ శ్రీనివాస్ పండిట్, ఫిజికల్ డైరెక్టర్ సైల పద్మరాజ్ మాస్టర్, వెంకట నాయుడు వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ నైపుణ్య ప్రదర్శనలు నిర్వహించి, పిల్లలను ఆకట్టుకున్నారు. మిమిక్రి & ఆర్కెస్ట్రా కార్యక్రమం అతిథులను మరియు పిల్లలను నవ్వులతో ఆనందంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా హాజరైన కూటమి నాయకులను కార్తీక్ మీడియా యాంకర్ కార్తీక్ సన్మానించారు. కార్యక్రమం ప్రారంభం అనంతరం పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మినారాయణ మోదటి ఇంటర్వ్యూ నిర్వహించబడింది. ఈ వేడుకలో బళ్లా హరి పాల్గొన్నారు.

Share this content:

Post Comment