విజయ్ సేతుపతి సరసన కత్రిన

ధనుష్ లానే మరో తమిళ్ హీరో విజయ్ సేతుపతి కూడా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ని ఆకట్టుకుంటున్నాడు. అద్భుతమైన యాక్టింగ్ చేసే విజయ్ సేతుపతి అటు హీరోగా, ఇటు విలన్ గా వేషాలు వేస్తున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ లో రెండు సినిమాలు సైన్ చేశాడు.

అయితే,  విజయ్ సరసన బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు కూడా నటించేందుకు ఒప్పుకుంటుండడం విశేషం. లేటెస్టుగా బాలీవుడ్ విలక్షణ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ (“అంధాదున్” ఫేమ్) విజయ్ సేతుపతి హీరోగా బాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా కత్రిన కైఫ్ సైన్ చేసిందట. అంటే విజయ్ సేతుపతి సరసన కత్రిన నటిస్తుంది. ఒక్కసారిగా విజయ్ సేతుపతి రేంజ్ పెరిగిపోయింది. విజయ్ సేతుపతి విలన్ గా నటించిన తెలుగు మూవీ “ఉప్పెన” ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు.